Eatala: అది తట్టుకోలేకే బీజేపీ ఎంపీలపై రాహుల్ దాడి చేశారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
Eatala: అది తట్టుకోలేకే బీజేపీ ఎంపీలపై రాహుల్ దాడి చేశారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత లేదని పార్లమెంట్ (Parliament) సాక్షిగా ప్రధాని మోడీ (Prime Minister Modi) వంద కారణాలు చెప్పారని ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) అన్నారు. శనివారం చర్లపల్లి రైల్వే‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్‌ని అవమానపరిచింది, ఓడగొట్టడానికి ప్రయత్నించింది, వారిని బయటకు పంపించింది మీరు..(Congress) కాంగ్రెస్‌ పార్టీపై ఫైర్ అయ్యారు.

అంబేడ్కర్‌ (Ambedkar) ప్రవచించిన సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించి, అనగారిన వర్గాలకు, జాతులకు రిజర్వేషన్ ఇస్తే వ్యతిరేకించిన మీరు అంబేడ్కర్ పేరు చెప్పుకోవడానికి ఒక్క శాతం కూడా అర్హత లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు దొంగే దొంగ అన్నట్లుగా కొంగ జపం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాస్తవ చరిత్ర దేశ ప్రజానీకానికి తెలుస్తుంది కాబట్టి దాన్ని తట్టుకోలేక కావాలనే పార్లమెంటు ముందే రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీజేపీ ఎంపీలపై దాడి చేశారని ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా దీన్ని తీవ్రంగా ఖండించామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed