ఒకే స్క్రీన్‌పై ఇద్దరు టాలీవుడ్ స్టార్స్.. హైప్ పెంచుతున్న పోస్ట్

by Hamsa |   ( Updated:21 Dec 2024 1:13 PM  )
ఒకే స్క్రీన్‌పై ఇద్దరు టాలీవుడ్ స్టార్స్.. హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh)నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). దీనిని అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. ఇటీవల ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ సాంగ్ హుజ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

అయితే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెంకటేష్ బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్-4(Unstoppable Season 4) షోకు గెస్టుగా రాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో.. తాజాగా, ఈ విషయం గురించి ఆహా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానుల ఆనందానికి కారణమవుతోంది.

అందులో ఏముందంటే.. ‘‘మొదటిసారి, తెలుగు సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటి ఎన్‌బికే సీజన్ 4తో అన్‌స్టాపబుల్‌తో టాక్ షోలో అరంగేట్రం చేయనున్నారు. వెంకటేష్ దగ్గుబాటి పాల్గొనే రాబోయే ఎపిసోడ్ డిసెంబర్ 22, 2024న చిత్రీకరించబడుతుంది. దిగ్గజ నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ దగ్గుబాటి మధ్య ప్రత్యేక సంభాషణను మిస్ చేయవద్దు. ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే NBK సీజన్ 4తో అన్‌స్టాపబుల్ ఏడవ ఎపిసోడ్‌ను చూడవచ్చు’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో హైప్ పెంచుతోంది.


Next Story

Most Viewed