ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్‌‌బాస్ బ్యూటీ.. వీడియో వైరల్

by Hamsa |
ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్‌‌బాస్ బ్యూటీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: మంథనికి చెందిన సోనియా(Sonia) ఆకుల యాంకర్‌గా పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ఆమె రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుని ఏకంగా తెలుగు రియాలిటీ షోలో అవకాశం అందుకుంది. బిగ్‌బాస్-8(Bigg Boss-8)లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన అందం, ఆట తీరుతో వారంలోనే సోషల్ మీడియా మొత్తం ఆమె పేరు మారుమోగేలా చేసింది. కానీ హౌస్‌లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే.. తన ప్రియుడు యష్ వీరగోని(Yash Veeragoni)తో నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది.

ఇటీవల ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్ ఆటతీరుపై సంచలన కామెంట్స్ చేసి నెట్టింట దుమారం రేపింది. ఇదిలా ఉంటే.. తాజాగా, సోనియా శుక్రవారం డిసెంబర్ 20న పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు యష్‌తో ఏడడుగులు వేసింది. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు(Photos), వీడియోలు(Videos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో మాత్రం బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్(Nikhil), పృథ్వీలు కనిపించకపోవడం గమనార్హం. ఇక సోనియా పెళ్లి ఫొటోలు చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed