CM Revanth:‘తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే’.. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్!

by Jakkula Mamatha |   ( Updated:2024-12-21 10:20:01.0  )
CM Revanth:‘తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే’.. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్!
X

దిశ,వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం) సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పుష్ప-2 మూవీ ప్రీమియర్ రోజు అల్లు అర్జున్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వచ్చాడు. అది కూడా ర్యాలీ చేసుకుంటూ వచ్చాడు. తొక్కిసలాట జరిగిన తర్వాత వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. అయినా వినలేదు. అరెస్టు చేస్తామని హెచ్చరిస్తేనే వెళ్లిపోయారు. నార్మల్‌గా వచ్చి వెళ్తే ఇలా జరిగి ఉండేది కాకపోవచ్చు. కాని రూఫ్ టాప్ కారులో అభివాదం చేశారు. వేలాది మంది ఉప్పెనల రావడంతో తొక్కిసలాట జరిగింది. హీరో థియేటర్ లోపలికి వెళ్లే ముందు ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలి తీసుకెళ్లాల్సిన బౌన్సర్లు అందరు అభిమానులను ఇష్టమొచ్చినట్టు తోశారు.

దీంతో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. మళ్లీ హీరో వెళ్తూ చేతులు ఊపుకుంటూ వెళ్లారు అని మండిపడ్డారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను(Allu Arjun)పరామర్శించిన సినీ సెలబ్రీటీలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘ఓ బాలుడు నెల రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతుంటే వాళ్లేవరైనా పరామర్శించారా? ఒకపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడడానికి వెళ్లినట్టు వెళ్లారు. అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story