ఆ పది రోజులు మా కుటుంబం మొత్తానికి చాలా ప్రత్యేకం.. రాజమౌళి స్పెషల్ పోస్ట్

by Hamsa |
ఆ పది రోజులు మా కుటుంబం మొత్తానికి చాలా ప్రత్యేకం.. రాజమౌళి స్పెషల్ పోస్ట్
X

దిశ, సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా(Sri Simha) పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఉస్తాద్, దొంగలున్నారు జాగ్రత్త సినిమాలతో హీరోగా పరిచయం అయి మత్తు వదలరా పార్ట్-1(Mathu Vadalara 2), పార్ట్-2తో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవల శ్రీసింహా పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. నటుడు రాజకీయ నాయకుడు మురళీ మోహన్(Murali Mohan) మనవరాలు రాగ మాగంటితో కలిసి ఏడడుగులు వేశాడు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రాస్ ఏఐ కైమాలో వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) డిసెంబర్ 14న జరిగింది. అయితే ఈ పెళ్లిలో రాజమౌళి తన భార్యతో కలిసి హాజరయి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రాజమౌళి(Rajamouli) శ్రీసింహా పెళ్లి రోజులు స్పెషల్ అని ఓ పోస్ట్ పెట్టారు. ‘‘గత 10 రోజులు సింహా-రాగ వివాహ సమయంలో చాలా అందమైన క్షణాలతో నిండిపోయింది. అవి చాలా ప్రత్యేకంగా మారాయి. కుటుంబంలోని మనందరికీ దీన్ని నిజంగా గుర్తుండిపోయేలా చేసిన వ్యక్తులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. అలాగే పెళ్లి పనుల్లో సాయం చేసిన వారి గురించి వివరించారు. పలు ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story