Srikalahasti:శ్రీకాళహస్తిలో పెరిగిన భక్తుల రద్దీ

by Jakkula Mamatha |
Srikalahasti:శ్రీకాళహస్తిలో పెరిగిన భక్తుల రద్దీ
X

దిశ,శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవులు కావడంతో తెల్లవారుజాము నుంచే రద్దీ మొదలైంది. స్వామి అమ్మవార్ల అభిషేకాలకు, రాహు కేతు పూజలకు కూడా భక్తులు విశేషంగా తరలి వచ్చారు. శనివారం కావడంతో ఆలయంలోని శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించడానికి కూడా భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed