BRS: రామ రాజ్యంలో జరిగిందే రేవంత్ రాజ్యంలో కూడా.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: రామ రాజ్యంలో జరిగిందే రేవంత్ రాజ్యంలో కూడా.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రామ రాజ్యంలో ఏం జరుగుతుందో రేవంత్ రాజ్యంలో కూడా అదే జరుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) అన్నారు. సిద్దిపేట(Siddipeta)లోని పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్(Physical Director) విద్యార్థులను చితకబాదిన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మా పిల్లల దేహాల మీద ఈ వాతలు మాకు సుపరిచితమేనని, రెండు వేల సంవత్సరాల నుండి మా దేహాలు వికృత క్రీడలకు బలౌతునే ఉన్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే శంభూకుడి నుండి స్పార్టకస్ దాకా.. కుడియాంకులం నుండి నేటి హత్రాస్ దాకా.. నీరుకొండ నుండి పదిరికుప్పం దాకా.. చుండూరు నుండి లక్ష్మిపేట దాకా.. కారంచేడు నుండి ఖైర్లాంజి దాకా.. ఊనా నుండి వెంకటాయ పాలెం దాకా.. మీ కొరడా దెబ్బలు తిని మా చర్మం చచ్చుబడ్డది మెదళ్లు మొద్దుబారినాయి అని వ్యాఖ్యానించారు. అంతేగాక నాడు రామరాజ్యంలో ఏం జరిగిందో.. నేడు రేవంత్(CM Revanth Reddy) రాజ్యంలో అదే జరుగుతున్నది అని అన్నారు. గురుకులాల్లో గరళం ఏరులై పారుతున్నదని, మా బిడ్డల కలలు మీ విద్వేషపు అగ్ని కీలల్లో భస్మమైతున్నవి అని అన్నారు. ఇక మా తల్లిదండ్రుల కంటతడి షరామామూలేనని, మా ప్రజాప్రతినిధుల మౌనం యధాతధానే అని, అందుకే అందుకోండి మా ఈ నివాళి అని రాసుకొచ్చారు. చివరగా ఇంత వరకు పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన అధికారుల మీద ఎలాంటి చర్యలు లేవని, ఈ దాడి కూడా ప్రతిపక్షాలు చేసిన కుట్రగా వర్ణించడానికి గాంధీ భవన్లో(Gandhi Bhavan) స్క్రిప్ట్ రెడీగా ఉందని ఆర్ఎస్పీ(RSP) దుయ్యబట్టారు.

Next Story

Most Viewed