- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP: ఉచిత గ్యాస్ సిలిండర్.. ఇక ఐదురోజుల వరకే అవకాశం

దిశ, డైనమిక్ బ్యూరో : తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas cylender) బుక్చేసుకునేందుకు మార్చి 31 వరకే అవకాశం ఉందని ఆహారం పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఇప్పటి పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని వివరించారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి ఏడాది ఏప్రిల్ - జూలై, ఆగష్టు – నవంబర్, డిసెంబర్ – మార్చి మధ్య సిలెండర్బుక్చేసుకోవచ్చు. ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు అని ఆయన వివరించారు.