ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు

by Kalyani |
ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు
X

దిశ, రవీంద్రభారతి : ప్రదర్శన కుంభహారతి తో ప్రారంభమై వినాయక కౌతం, అన్నమాచార్య కీర్తన, దశావతార శబ్దం, కైవరం లాంటి తదితర అంశాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నృత్య గురువు రేఖ గరిషకుర్తి ఆధ్వర్యంలో 28 మంది అకాడమీ విద్యార్థులచే ప్రదర్శించిన ఆంధ్ర నాట్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది. లాస్య రంజని క్లాసికల్ డాన్స్ అకాడమీ దశమ వార్షికోత్సవం వేడుకలను శనివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారక రామారావు కళా మందిరంలో ఘనంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమామహేశ్వరి, కళా పత్రిక ఛీఫ్ ఎడిటర్ మహమ్మద్ రఫీ, రిటైర్డ్ సైంటిస్ట్ (ఇస్రో) దేవీ ప్రసాద్ శర్మ, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డా. కళాకృష్ణ పాల్గొని నృత్య గురువు రేఖ గరిషకుర్తి ను విద్యార్థులను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed