Christmas : క్రిస్మస్‌ ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా..? మిమ్మల్ని ఆకట్టుకునే అందమైన ప్రాంతాలివే..

by Javid Pasha |
Christmas : క్రిస్మస్‌ ట్రిప్‌కి ప్లాన్ చేస్తున్నారా..? మిమ్మల్ని ఆకట్టుకునే అందమైన ప్రాంతాలివే..
X

దిశ, ఫీచర్స్ : క్రిస్మస్.. డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఈ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పటికే రకరకాల క్రిస్మస్ సామగ్రితో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. చాలా మంది ఫెస్టివల్ షాపింగ్‌లో నిమగ్నమైపోయారు. ఇక ఇండియాలో ఉంటూ ఫారిన్ కంట్రీస్ కంపెనీలకోసం వర్క్ చేసే ఎంప్లాయీస్‌కు అయితే ఈ ఫెస్టివల్ సందర్భంగా ఎక్కువ రోజులు హాలిడేస్ దొరుకుతాయి. కాబట్టి చాలామంది పండుగకి ముందు, పండు రోజు, పండుగ తర్వాత కూడా వివిధ టూరిస్ట్ ప్లేస్‌లను సందర్శించడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి ఔత్సాహికులకోసం ఇండియాలో ఉన్న బెస్ట్ ప్లేస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

* గోవా : సాధారణ సమయాల్లోనే కాదు, క్రిస్మస్ ఫెస్టివల్ స్పెషల్ డెస్టినేషన్‌గానూ గోవా ప్రసిద్ధి చెందింది. నెల రోజుల ముందు నుంచే ఇక్కడ హడావిడి మొదలవుతుంది. చర్చ్‌లన్నీ రంగు రంగుల లైట్లతో, అలంకరణలతో ఆకట్టుకుంటాయి. అక్కడి హోటళ్లు, వ్యాపార సముదాయాలు కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాయి. ముఖ్యంగా క్రిస్మస్ సందర్భంగా రాత్రివేళల్లో సంగీత కచేరీలు ఆకట్టుకుంటాయి. ఇక్కడి సెకేథడ్రల్‌లోని బీచ్‌లలో క్రిస్మస్ పార్టీలను ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. మొత్తానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు గోవా చక్కటి వేదికగా నిలుస్తోంది.

*సిమ్లా : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిల్ స్టేషన్‌లలో ఒకటైన సిమ్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. వేడుకలతో పాటు ఇక్కడి ఎగుడు దిగుడు పర్వత లోయలు, పచ్చటి ప్రకృతి ఆకట్టుకుంటుంది. కాబట్టి చాలామంది టూరిస్టులు తమ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ అయితే టూరిస్టులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెబుతుంటారు.

* డయ్యూ డామన్ : డయ్యూడామన్ కేంద్రపాలిత ప్రాంతమనే విషయం తెలిసిందే. అయితే ఇది క్రిస్మస్ సందర్భంగా టూరిస్టులను ఆకట్టుకునే బెస్ట్ డెస్టినేషన్‌గా ప్రఖ్యాతి గాంచింది. అందమైన బీచ్‌లు, డెకరేట్ చేసిన చర్చ్‌‌లు, ట్రెడీషనల్ అండ్ పోర్చుగీస్ స్పెషల్ వంటకాలు చాలామందిని ఆకట్టుకుంటాయి.

* కోల్ కతా : మరొక క్రిస్మస్ స్పెషల్ డెస్టినేషన్ ప్లేస్ కోల్‌కతా అని చెప్పవచ్చు. ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువగా నివసిస్తుంటారు. కాబట్టి క్రిస్మస్ వేడుకలకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక చర్చ్‌లు డిసెంబర్ నెలలో అద్భుతమై అలంకరణలతో ఆకట్టుకుంటాయి. ఇక కొల్ కతాలో వింటర్ స్పెషల్ స్వీట్స్ అయితే క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. దీంతోపాటు క్రిస్మస్ ట్రీలు, లైట్స్, స్టార్లతో కొల్ కొతా వీధులన్నీ టూరిస్టులకు వెల్కమ్ చెబుతుంటాయి.

*ఢిల్లీ : క్రిస్మస్ సమయంలో చాలామంది టూరిస్టులు ఇష్టపడే మరో డెస్టినేషన్ ఢిల్లీ. ఇక్కడి చర్చ్‌లను ఎంతో అందంగా డెకరేట్ చేస్తారు. ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి క్రిస్మస్ వేడుకలు ముగిసే వరకు సంగీత కచేరీలు, క్రిస్మస్ పార్టీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇక్కడి ఈవ్ పార్టీలు, షాపింగ్ మాల్స్‌లో క్రిస్మస్ కార్నివల్స్ టూరిస్టులకు మధురానుభూతిని కలిగిస్తాయి.

*పాండిచ్చేరి : పాండిచ్చేరి క్రిస్మస్ ఫెస్టివల్ స్పెషల్ డెస్టినేషన్ అని చెప్పవచ్చు. ఇక్కడి ఫ్రెంచ్ కాలనీలో వేడుకలు ఘనంగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చర్చీలన్నీ అందమైన అలంకరణలతో ఆకట్టుకుంటాయి. ప్రత్యేకమైన వంటకాలు, ప్రశాంతమైన వాతావరణం క్రిస్మస్ వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

* హైదరాబాద్ : ముంబై, చెన్నై, హైదరాబాద్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం కూడా క్రిస్మస్ వేడుకలకు ప్రసిద్ధి చెందినవి. చాలామంది ఇక్కడి వేడుకల్లో పాల్గొనడానికి వస్తుంటారు. విదేశీలయులు సికింద్రాబాద్, అలాగే మెదక్ చర్చ్ వేడుకల్లో పాల్గొనడానికి ప్రతీ సంవత్సరం ఇక్కడి వస్తుంటారు. క్రిస్మస్ హాలిడేలో ఎంజాయ్ చేయగలిగిన బెస్ట్ డెస్టినేషన్‌లలో హైదరాబాద్ కూడా ఫేమస్.

Advertisement

Next Story