మంచి తల్లి అవ్వాలంటే పిల్లల కోరికలన్నింటినీ నెరవేర్చడమే కాదు..!!

by Anjali |
మంచి తల్లి అవ్వాలంటే పిల్లల కోరికలన్నింటినీ నెరవేర్చడమే కాదు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు(children) పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు చాలా జాగ్రత్తగా, బాధ్యతయుతం(Responsible)గా పెంచాలని ప్రతి ఒక పేరెంట్ అనుకుంటారు. తండ్రుల కంటే తల్లులే పిల్లలపై కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటుందని చెప్పొచ్చు. అయితే పిల్లల్ని పెంచే విషయంలో మంచి తల్లి అనిపించుకోవాలన్నా.. అవ్వాలన్నా కేవలం పిల్లల కోరికల్ని నెరవేర్చడమే కాకుండా వారి సద్గుణాల(Virtues)ను పెంపొందించడంలోనూ శ్రద్ధ చూపించాలంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం అని బిజీ షెడ్యూల్ రీత్యా కొంతమంది తల్లిదండ్రులు.. పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారు.

రోజూ పిల్లలతో కాసేపైన కూర్చోని మాట్లాడి.. వారి ఇష్టాలు తెలుసుకోవాలి. పిల్లల కోరికలన్నింటిని నెరవేర్చాల్సిన అవసరం లేదు. కేవలం తమ అవసరాలను మాత్రమే గుర్తించి ఆ వస్తువులను కొనివ్వాలి. వారి గోల్ ఏంటి? జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో అడిగి.. ఈ విషయంలో పిల్లల్ని ప్రోత్సహించాలి. ఒకవేళ పిల్లలు తల్లిపై కోప్పడినా, చెప్పిన మాట వినకపోయిన.. వారిపై అరవకూడదు. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ.. వారి మైండ్‌ను కూల్ చేయాలి. ముందుగా ఆ సమయంలో తల్లులు ప్రశాంతంగా, ఓపికగా ఉండేందుకు ప్రయత్నించాలి. తర్వాత పిల్లలకు ఏది తప్పు, ఒప్పు అని వివరించాలి.

అలాగే బయటకెళ్లినప్పుడు.. పిల్లలకు నచ్చిన ఐటెమ్స్ ప్రతిసారి కొనలేమని చెప్పొద్దు. వారికి అవసరమైనవైతే.. తప్పకుండా కొనడానికి ప్రయత్నించాలి. లేకపోతే మీపై పిల్లలకు ప్రేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలతో ఎప్పుడూ కానీ రూడ్‌గా మాట్లాడవద్దు. మర్యాదగా మాట్లాడండి. పిల్లలతో మీరేలా మాట్లాడతారో వారు ఇతరులతో అలాగే మాట్లాడుతారు. అంతేకాకుండా పిల్లలు చేసే ఏ చిన్న పనైనా సరే.. గుడ్ గర్ల్, గుడ్ బాయ్ అంటూ వారిని మెచ్చుకోండి. దీంతో వారి హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మరిన్ని పనులపై ఫోకస్ చేసేందుకు ప్రోత్సాహాన్ని అందించినవారు అవుతారు.

Advertisement

Next Story

Most Viewed