Arvind Kejriwal :అంబేద్కర్‌‌పై అమిత్‌షా వ్యాఖ్యలు.. కీలక ‘స్కీం’ ప్రకటించిన కేజ్రీవాల్

by Hajipasha |
Arvind Kejriwal :అంబేద్కర్‌‌పై అమిత్‌షా వ్యాఖ్యలు.. కీలక ‘స్కీం’ ప్రకటించిన కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌(Ambedkar)పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న తరుణంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. ‘డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ స్కాలర్‌షిప్ స్కీం’‌ను ఢిల్లీలో అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకునేందుకు ఆయన పేరుతో ఈ స్కీంను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈవిషయాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘సాక్షాత్తూ భారత పార్లమెంటులోనే అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఒక ఎంపీ ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించి ఉండరు. అమిత్‌షా వ్యాఖ్యలు చాలా తప్పు’’ అని ఆయన ఫైర్ అయ్యారు.

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన దళిత విద్యార్థులకు(Dalit students) ఈ స్కీం ద్వారా ఆర్థికసాయాన్ని అందిస్తామన్నారు. డబ్బులు లేవనే కారణంతో ఏ దళిత విద్యార్థి కూడా విదేశీ విద్యను మిస్ కాకూడదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దళిత వర్గాలకు చెందిన గవర్నమెంటు ఉద్యోగుల పిల్లలు కూడా ఈ స్కీంతో లబ్ధి పొందొచ్చని తెలిపారు. ‘‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌ (ఎల్‌ఎస్‌ఈ)లో అంబేద్కర్ చదువుతుండగా.. డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అంబేద్కర్ ఇండియాకు తిరిగొచ్చారు. ఇంటికి వెళ్లి డబ్బులను సిద్ధం చేసుకున్నారు. అనంతరం మళ్లీ లండన్‌లోని కాలేజీకి వెళ్లిపోయారు. విద్యను పూర్తి చేశారు’’ అని అరవింద్ కేజ్రీవాల్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed