- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అధికారులు సమన్వయంతో ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి'
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ జిల్లా తునికి లో జరిగే ఉప రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25వ కౌడిపల్లి మండలం తునికి లో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారు. శనివారం హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన లో ఏలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం 2:15 నుంచి 4:15 వరకు రెండు గంటల పాటు మెదక్ జిల్లాలో ఉంటుందని, ఈ కార్యక్రమానికి పోలీసు, వైద్య ,ఆర్ అండ్ బి, ఇతర శాఖల సమన్వయంతో పని పని చేస్తామన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ చేసి, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, డయాస్ ను అలంకరిస్తామన్నమని, కృషి విజ్ఞాన కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఆర్గానిక్ వ్యవసాయం పై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారని, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడతారని, అత్యవసర వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని కలెక్టర్ సి స్ శాంతి కుమారి కి వివరించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీ స్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.