AAP leaders: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు కీలక నేతలు

by Shamantha N |
AAP leaders: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు కీలక నేతలు
X

దిశ, నేషనల్ బ్యూరో:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బల్బీర్‌ సింగ్ (Balbir Singh)‌, సుఖ్‌బీర్‌ దలాల్‌ (Sukhbir Dalal) రాజీనామా చేసి బీజేపీ (BJP) లో చేరారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ (Virendra Sachdeva), పార్టీ జనరల్‌ సెక్రెటరీ ఆశీశ్‌ సూద్ (Ashish Sood)‌, కేంద్ర మంత్రి హర్ష మల్హోత్ర (Harsha Malhotra) సమక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.

త్వరలో ఢిల్లీ ఎన్నికలు

ఇకపోతే, బల్బీర్‌ సింగ్‌ ఏకంగా ఆరు సార్లు ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రభుత్వం తన సూచనను పరిగణలోకి తీసుకోవడం లేదని, ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్కూళ్లలో పంజాబీ టీచర్‌లను నియమించడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సర్కారు ఏ పనీ సరిగా చేయడం లేదని సుఖ్‌బీర్‌ దలాల్‌ విమర్శించారు. ఇకపోతే, ఢిల్లీలో వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ కూడా త్వరలో తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed