- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి..
దిశ, సంగారెడ్డి : పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీ నుంచి పాత బస్టాండు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషి శాంతితో, సుఖశాంతులతో ఉన్నారంటే అది డా.బీఆర్.అంబేద్కర్ చలువే అన్నారు. రాజ్యాంగం వల్లే దేశం సుఖశాంతులతో ఉండడం సాధ్యమైందన్నారు. పార్లమెంట్ లో స్పీకర్ సాక్షిగా అంబేద్కర్ ను హోంమంత్రి అమిత్ షా కించపరిచారన్నారు. రాహుల్ గాంధీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ లో ప్రశ్నించారు. కానీ ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదన్నారు. పార్లమెంట్ బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీని అడ్డుకున్నారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా అంబేద్కర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పే వరకు వివిధ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.
దేశంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉన్నారంటే అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అది సాధ్యమైందన్నారు. నాడు నెహ్రూ క్యాబినెట్ లో నే అంబేద్కర్ రాజ్యాంగం రాశారని అలాంటి అబేంద్కర్ ను బీజేపీ అవమానిస్తే రాహుల్ గాంధీ నిలదీస్తున్నారన్నారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసుండాలనేది కాంగ్రెస్ సిద్దాంతమన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అని ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక దళితున్ని దేశ అధ్యక్షున్ని చేసిందని, బీజేపీ పార్టీ దళితున్ని జాతీయ అధ్యక్షుడిని చేస్తుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలు పాటించేవారు జాతీయ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. అంబేద్కర్ ను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పేవరకు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, నాయకులు తోపాజీ అనంతకిషన్, కూన సంతోష్, ప్రవీన్, మునిపల్లి సత్యనారాయణ, జార్జ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.