AP News:కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా వార్నింగ్!

by Jakkula Mamatha |
AP News:కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా వార్నింగ్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు(శనివారం) తిరుపతి నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. ‘నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ ఆమె ఛాలెంజ్ చేశారు. ఫైల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి నా తప్పు ఏంటో నిరూపించండి’ అన్నారు.

ఇన్నాళ్లు జగన్‌ను(Former CM Jagan) చూస్తే భయపడ్డారు. ఈ రోజు జగన్ కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పై నెల రోజులకే వ్యతిరేకత మొదలైందని ఆమె పేర్కొన్నారు. కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నా మా పార్టీ నాయకుల ఆస్తులు కూలదోచినా వేధించినా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ అన్న నాయకత్వంలో.. జగన్ అన్నకు తోడుగా అండగా ప్రజల పక్షాన పోరాటం చేద్దాం అని ఆమె పిలుపునిచ్చారు. కులం, మతం లేకుండా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు. అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బాబు ఘారిటీ అని చెప్పి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అంటున్నారు. పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు, బెల్ట్ షాపులు పెడుతున్నారు అని ఆమె మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed