- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీఓఏలపై లైంగిక వేధింపులు..
సమాజంలో లింగ వివక్షకు గురవుతూ ఆర్థికంగా చితికిపోయి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలను వారి సొంత కాళ్లపై నిలబడేలా చేసి మహిళా సాధికారత వైపు నడిపించడం కోసం ఏర్పాటు చేసిందే డ్వాక్రా పథకం. అయితే, ఏ లక్ష్యం కోసం ఐతే డ్వాక్రా పథకాన్ని ప్రవేశ పెట్టారో దానికి భిన్నంగా ఈ సంస్థలో పనిచేసే మహిళలకే రక్షణ లేకుండా పోయింది. సెర్ఫ్ సంస్థలో క్లస్టర్ కో ఆర్డినేటర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అనేక మంది పురుష ఉద్యోగులు వారి కింద విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నటువంటీ వీ.ఓ.ఏలను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17,000కి పైగా వి.ఓ.ఏలు ఉండగా వీరిలో మహిళా వీ.ఓ.ఏలను, క్లస్టర్ కో ఆర్డినేటర్‌లు పని పేరుతో ఒక సమయం సందర్భం లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా ఫోన్‌లు, మెసేజ్‌లు చేస్తూ తాను చెప్పినట్టు వినాలని లేకుంటే వి.ఓ.ఏ నుంచి తొలగిస్తామని బెదిరిస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని సెర్ప్ సంస్థలో పనిచేసే అనేక మంది మహిళా వి.ఓ.ఏలు వాపోతున్నారు.
సెర్ప్ మనుగడకు ప్రధాన కారకులు..
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై లింగ వివక్షను నిర్మూలించి, వారిని అభివృద్ధి చేయడానికి డ్వాక్రా(డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం మొదట డ్వాక్రా పేరుతో ప్రారంభమైనా సందర్భానుసారంగా ఈ పథకం పేరును వెలుగుగా, ఐ.కే.పీగా మార్చారు. ప్రస్తుతం సెర్ప్ అనే పేరుతో ఈ సంస్థ కొనసాగుతోంది. ఈ పథకాన్ని 1982లో అమల్లోకి తెచ్చి మొదటగా దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆ తర్వాత దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 2000-2002 సంవత్సరం నుంచి ఈ సంస్థ ప్రారంభం అయినప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో మహిళలను సంఘాల్లో సభ్యులుగా చేర్చి ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళలకు అవగాహన కల్పించడం నుంచి వారికి బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి రుణాలను మంజూరు చేసి మళ్లీ నిర్ణీత సమయంలో మహిళా సభ్యుల నుంచి తీసుకున్న రుణాలను రికవరీ చేసే దాకా ఇటు బ్యాంక్‌కి, సంస్థ పై అధికారులకు, మహిళా సంఘంలోని సభ్యులకు మధ్య అనుసంధాన కర్తగా ఉండి ప్రతిదీ తానై చాలిచాలనటువంటి జీతాలతో రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ సెర్ప్ సంస్థ మనుగడకు ప్రధాన కారకులు వీ.ఓ.ఏ లే అని చెప్పక తప్పదు.
పని పేరుతో..
సెర్ప్ సంస్థలో క్లస్టర్ కో ఆర్డినేటర్ ఉద్యోగులుగా పని చేస్తున్న అనేక మంది పురుష ఉద్యోగస్తులు వారి కింద పనిచేస్తున్న వి.ఓ.ఏ లను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళా వీ.ఓ.ఏలకు క్లస్టర్ కో ఆర్డినేటర్‌లు పని పేరుతో రాత్రి వేళల్లో సైతం ఫోన్‌లు మెసేజ్‌లు చేస్తూ తాను చెప్పినట్టు వినాలని లేకుంటే వి.ఓ.ఏ నుంచి తొలగిస్తామని మహిళా వి.ఓ.ఏలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం వి.ఓ.ఏలకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో పాటు వారీ జీతాలు సంఘాల గ్రేడింగ్‌పై ఆధారపడి ఉండటం. ఇదే అదునుగా భావిస్తున్న క్లస్టర్ కో ఆర్డినేటర్‌లు వారికి సహకరించిన మహిళా వి.ఓ.ఏలకు ఫేక్ గ్రేడింగ్‌లు ఎంట్రీ చేసి ఏ లేదా బి గ్రేడింగ్‌లో వచ్చేలా చూపిస్తూ ఆడిట్ సమయంలో ఆడిటర్లుగా వచ్చిన ఆ సంస్థలోని వారితో సఖ్యతగా వ్యవహరిస్తూ ఆన్‌లైన్‌లో ఉండే నివేదికకు మ్యానువల్ రికార్డులకు ఏ సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. పైగా ఇలా ఆరోపణలు ఎదురుకుంటున్నటువంటి క్లస్టర్ కో ఆర్డినేటర్‌లను క్రమ శిక్షణ చర్యల కింద ఇతర ప్రాంతానికో లేక మండలానికో బదిలీలు చెయ్యకుండా పై స్థాయి ఉద్యోగస్తులు వారికి సహకరిస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేక వేధింపులకు గురి అవుతున్న అనేక మంది మహిళలు మనోవేదనకు గురి అవుతున్నారు.
ఏం చేయాలి..
మహిళలకు రక్షణ కల్పించకుండా, వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దకుండా, మహిళలకు ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పర్చకుండా మహిళా సాధికారత ఎలా సాధ్యం అవుతుందని విద్యావంతులు భావిస్తున్నారు? అందుకే మహిళా శిశు సంక్షేమ శాఖలో.. సీడీపీఓ, సూపర్వైజర్ లాంటి ఉద్యోగాలలో పూర్తిగా మహిళలతోనే నియామకాలు భర్తీ చేస్తున్నట్టు సెర్ప్ సంస్థ కూడా మహిళలకు సంబందించినది కాబట్టి ఈ సంస్థలో ఉండే పురుష ఉద్యోగుల్ని ఇతర శాఖలకు బదిలీ చేసి పూర్తిస్థాయిలో మహిళలతో నియామకాలు చేపట్టాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రితో సెర్ప్ సంస్థకి కమిషనర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముగ్గురు మహిళలే ఉండటం వలన ఈ సంస్థలో ఉన్న లోపాలను సవరించి మహిళలకు రక్షణ కల్పించి మహిళా సాధికారత కోసం అడుగులు వేస్తే బాగుంటుందని మేధావులు అనుకుంటున్నారు.
-మాణిక్ రావు డోంగ్రే
99515 87876