- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chamala: కిషన్ రెడ్డి బీఆర్ఎస్ విధానాలను అనుసరిస్తున్నాడు.. ఎంపీ చామల కిరణ్
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షుడి(Telangana BJP President)గా ఉన్న కిషన్ రెడ్డి(Kishan Reddy) బీఆర్ఎస్(BRS Party) విధానాలను అనుసరిస్తున్నాడని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) అన్నారు. మూసీ ప్రక్షాళన(Moosi Renovation) పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. పలు విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి మూసీ రివర్ బెడ్ లో నివసిస్తున్న ప్రజలను కలవడం తప్పు లేదని, కానీ ఒక పార్టీకి అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రి(Union Minister) హోదాలో ఉండి, మూసీ ప్రక్షాళనపై మీరు చేస్తున్న అసత్య ప్రచారం తప్పు అని వ్యాఖ్యానించారు.
అలాగే మూసీ ప్రక్షాళనకు డీపీఆర్(DPR) లేదని చేప్పడం కరెక్ట్ కాదని, హైదరాబాద్ లో పడిన వర్షపు నీరు మూసీ నుంచే బయటికి వెళ్లాల్సి ఉంటుందని, కాబట్టి మూసీ నది ఎంత వెడల్పు పెంచాలి అన్నది ప్రణాళికల ప్రకారం అధికారులు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పుడే కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో మీ రాజకీయాల కోసం మూసీ నదిని వాడుకోవద్దని సూచించారు. అంతేగాక మూసీ వెంట నివసిస్తున్న ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఏం కావాలి.. ఏం ఇస్తే వారికి న్యాయం జరుగుతుందని తెలుసుకొని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి.. రాని డీపీఆర్ ను తప్పు పడుతూ.. ముఖ్యమంత్రి(CM Revanth Reddy)ని ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెబుతూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, బీఆర్ఎస్ విధివిధానాలను మీరు తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.