BREAKING: భారీ వరదల ఎఫెక్ట్.. ఆ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల సెలవు

by Shiva |   ( Updated:2024-09-04 15:33:24.0  )
BREAKING: భారీ వరదల ఎఫెక్ట్.. ఆ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల సెలవు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం భీభత్సం సృష్టించింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లి వరదలతో జన‌జీవనం స్తంభించింది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా (Khammam District) వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈనెల 6 వరకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (Muzammil Khan) సెలవులు ప్రకటించారు. తిరిగి సోమవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి ఆ సమాచారాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story