ఉద్యోగం ఏదైనా ప్రతిభ కనబరచాలి: కలెక్టర్ అనుదీప్

by Shiva |
ఉద్యోగం ఏదైనా ప్రతిభ కనబరచాలి: కలెక్టర్ అనుదీప్
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: చేసే ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైన ప్రతిభ కలబరిస్తే ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించ వచ్చని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో జిల్లా ఉపాధి మరియు శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.ఈ జాబ్ మేళాలో దాదాపుగా 5,200 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. అందులో 2,037 మంది వివిధ ఉద్యోగాల కొరకు ఎంపికైయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు, ప్రభుత్వం అందిస్తున్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఉద్యోగం రాని వారు నిరాశ చెందకుండా పట్టుదలతో మరో ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ అనుదీప్ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగం సాధించిన యువతకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ తన చేతుల మీదుగా అందజేశారు.

యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ యువత నిరంతరం తమ ప్రతిభకు పదును పెడుతున్నప్పుడే జీవితంలో స్థిరపడతారని పేర్కొన్నారు. సాధించిన ఉద్యోగం చిన్నదైనా అందులో చేరి ప్రతిభ కలబరుస్తూ ముందుకు పోవాలన్నారు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏది లేదన్నారు. జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించిన జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story