అమిత్ షా మాటలు రాజ్యాంగ విరుద్ధం

by Sridhar Babu |
అమిత్ షా మాటలు రాజ్యాంగ విరుద్ధం
X

దిశ, ఖమ్మం : అమిత్ షా ప్రవర్తన, మాటలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కాంగ్రెస్ కార్యాలయం నుండి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ అంబేద్కర్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశంగా భారత్​కు గౌరవం ఉందన్నారు. దేశంలో మహిళలకు సమాన హక్కు కల్పించింది రాజ్యాంగమని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వమే అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed