సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైంది

by Sridhar Babu |
సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ  ఏమైంది
X

దిశ, ఆదిలాబాద్ : అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. ఛాయ్​ తాగే లోపు జీవో ఇప్పిస్తాం అన్న సీఎం సంవత్సరమైనా ఇంకా ఛాయ్ తాగే సమయం దొరకలేదా అని ఎద్దేవా చేశారు. కలెక్టరేట్​ ఎదుట కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్న సీఎం నాడు టెంట్ కింద హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితి కనిపించలేదా అని ప్రశ్నించారు.

కోర్టు పేరుతో సాకులు చెప్తున్నా ప్రభుత్వం కోర్టు పరిధిలో లేని సమస్యలు పరిష్కరించవచ్చు కదా అని అన్నారు. ఉద్యోగులు కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కావన్నారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎవరూ అధైర్య పడద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో సీఎంతో నేరుగా ఫోన్లో మాట్లాడుతానని తెలిపారు.

పార్టీ తరఫున రూ..25 వేలు ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే దీక్ష శిబిరం లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో ఉద్యోగుల సమస్యలను ఫోన్ లో వివరించారు. అదే విధంగా జిల్లా గెజిటెడ్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివకుమార్, టి ఎన్జీవో స్ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షను సందర్శించి మద్దతు తెలిపారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, నాయకులు రమేశ్, నగేష్, వేణు గోపాల్, లాలా మున్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed