- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ ఆసుపత్రిలో పడకేసిన పారిశుద్ధ్యం
దిశ, భద్రాచలం టౌన్ : పూర్తిస్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది లేక ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ వైద్యంపై కార్మికుల సమ్మె మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల వేతనాలు చెల్లించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ తీరును వ్యతిరేకిస్తూ గత మూడు రోజులు నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. మూడు రోజులకే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ప్రతి వార్డులో ఆసుపత్రి మెడికల్ వ్యర్థాలతో కంపు కొడుతుంది.
ఇప్పటికే ఏజెన్సీ వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యం కోసం వస్తున్న రోగులకు ఆసుపత్రి వ్యర్ధాలతో కొత్త రోగాలు అంటుకుంటాయని ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి ఆవరణ మొత్తం వ్యర్ధాలతో దుర్వాసనలు వెదజల్లడం తో పాటు దోమలు సైర వ్యవహారం చేస్తున్నడంతో రోగులతో వచ్చిన సహాయకులు సైతం అనారోగ్య బారిన పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో పనిచేస్తే పారిశుద్ధ్య పేషంట్ కేర్ సెక్యూరిటీ తదితర డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేసే సుమారు 100 మంది పైచిలుకు కార్మికులు ఒకేసారి సమ్మె బాట పట్టడంతో తలెత్తిన పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉన్న రోగానికి వైద్యమేమో గాని కొత్త రోగాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిన నాటి నుండి వేతనాలు చెల్లించే దాంట్లో గతంలో కూడా అనేకసార్లు ఇదే వైఖరిని అవలంబిస్తే కార్మికుల సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కార్మికులు వేతనల కోసం సమ్మెకు దిగిన ప్రతి సందర్భంలో అరకొర వేతనాలు చెల్లించి తాత్కాలికంగా కార్మికులను శాంతింప చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపటం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని మెరుపు సమ్మెలోకి దిగిన కార్మికులు ఈ దఫా కాంట్రాక్టర్ నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.