- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యా సంబంధిత రిపోర్ట్ లను సకాలంలో పూర్తి చేయాలి
దిశ, కొత్తగూడెం : విద్యా సంబంధిత రిపోర్టులను మండల విద్యాధికారులు సకాలంలో పూర్తి చేయించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని ఆనందగని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొని మాట్లాడారు. విద్యా శాఖ ప్రగతిని తెలియజేసే ప్రతి రిపోర్ట్ ను ఇచ్చిన గడువులోగా పూర్తి అయ్యేలా బాధ్యత వహించి మండలంలోని ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులచే అప్డేట్ చేసే విధంగా మండల విద్యాధికారులు చూడాలని సూచించారు. ఇకముందు ప్రతి సోమవారం మండల స్థాయిలో అన్ని రిపోర్ట్ లను అప్డేట్ చేసుకొని జిల్లాకు సబ్మిట్ చేయాలని సూచించారు. ముఖ్యంగా U DISE+ లో విద్యార్థుల వివరాలు అప్డేట్ చేయడం, పాఠశాలలో మౌలిక వసతులను పారదర్శకంగా నమోదు అయ్యేలా చూడటంతో పాఠశాలలకు ప్రభుత్వం ద్వారా రావలసిన అన్ని రకాల సదుపాయాలు సకాలంలో కల్పిస్తారని తెలిపారు.
అదే విధంగా ప్రతి విద్యార్థి కి U DISE+ లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, అపార్ ఐడి జెనరేట్ చేయాలని సూచించారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ను ప్రతి పాఠశాలలో నమోదు చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ లో యూనిఫాం డేటాను అప్డేట్ చేయాలని, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రిపోర్ట్ లను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ లో అదే రోజు అప్డేట్ చేయాలని కోరారు. ప్రశస్త్ యాప్ ద్వారా విద్యార్థులను స్క్రీనింగ్ చేసి రిపోర్ట్ అప్డేట్ చేయాలని, విద్యాంజలి పోర్టల్ లో అన్ని పాఠశాలలను రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. డిసెంబర్ 3న జరిగే నాస్ పరీక్ష విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. పై అన్ని విషయాలపై మండలం వారీగా రివ్యూ చేసి ప్రతి వారం మండలం వారీగా ప్రోగ్రెస్ తనకు తెలియజేయాలని అన్నారు. ఈ రివ్యూ లో జిల్లా విద్యాధికారి ఎం.వెంకటేశ్వరచారి, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ సైదులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.