ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by samatah |
ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

దిశ సత్తుపల్లి : పెనుబల్లి మండల పరిధిలోని లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరు మండలం లోకవారం గ్రామానికి చెందిన నాగరాజు 20 మృతి చెందినట్లు, స్థానికులు తెలిపారు. సత్తుపల్లి నుండి మోటార్ సైకిల్ పై కల్లూరు వైపు వెళ్తున్న నాగరాజు ని, ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని అటువైపుగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కోటూరి మానవతారాయ్ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story