గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో కలకలం.. ఆస్పత్రి పాలైన 45 మంది విద్యార్థినీలు

by sudharani |   ( Updated:2022-12-13 06:13:44.0  )
గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో కలకలం.. ఆస్పత్రి పాలైన 45 మంది విద్యార్థినీలు
X

దిశ, జూలూరుపాడు: కలుషిత ఆహారం తీసుకున్న కారణంగా 45 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గర్ల్స్ హాస్టల్‌లో నిన్న రాత్రి భోజనం అనంతరం 29 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

వెంటనే విద్యార్థులను స్థానిక జూలూరుపాడు ప్రాథమిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేశారు. ఈరోజు ఉదయం మరల 15 మంది విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు అవడంతో చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతానికి విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని అందరూ క్షేమంగానే ఉన్నారని వైద్యుడు తెలియచేస్తున్నారు. కాగా.. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read More....

ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం

Advertisement

Next Story