నోటి క్యాన్సర్లలో ఖమ్మం టాప్​.. అన్నింటిల్లోనూ ఆ జిల్లా ముందంజ

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-03 16:29:54.0  )
నోటి క్యాన్సర్లలో ఖమ్మం టాప్​.. అన్నింటిల్లోనూ ఆ జిల్లా ముందంజ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిరిసిల్లా,వరంగల్ జిల్లాల్లో బ్రెస్ట్​ క్యాన్సర్ ​దడ పుట్టిస్తున్నది. మిగతా జిల్లాలతో పోల్చితే ఈ రెండు జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన నాన్ ​కమ్యునికేబల్ ​డిసీజెస్ సర్వేలో 6,095 కొత్త క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను గుర్తించగా, వీరిలో అత్యధికంగా 1,997 మంది బ్రెస్ట్​ క్యాన్సర్ బాధితులు ఉండటం గమనార్హం. వీరిలో వరంగల్​ అర్బన్​జిల్లాలో 167 కొత్త కేసులు, సిరిసిల్లా జిల్లాలో మరో 166 చొప్పున తేలాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో​లో 155, ఖమ్మం జిల్లాలో 154, వరంగల్​ రూరల్​ జిల్లా లో 118, పెద్దపల్లి జిల్లా లో 117 మంది బాధితులను కొత్తగా గుర్తించారు. ఇక నోటి క్యాన్సర్లలో ఖమ్మం జిల్లా టాప్​ ప్లేస్​లో ఉండటం ఆందోళనకరం. ఏకంగా కొత్తగా 150 మంది కొత్త బాధితులు తేలారు. ఆ తర్వాత కరీంనగర్​ జిల్లాలో 106, వరంగల్​ అర్బన్ జిల్లాలో 106, జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 81 మందిలో నోటి క్యాన్సర్​ కేసులను గుర్తించారు. మరోవైపు నోటి, బ్రెస్ట్​, సర్వైవల్​, ఇతర అన్ని రకాల క్యాన్సర్లు అత్యధికంగా కరీంనగర్ లో కొత్తగా 459 మంది కి నిర్ధారణ అయింది. ఆ తర్వాత స్థానంలో నిర్మల్​జిల్లా లో 360, రాజన్న సిరిసిల్లా జిల్లా లో 357, పెద్దపల్లిలో 317,సంగారెడ్డిలో 293, యాదాద్రిలో 286 మంది వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు.

కారణాలు ఇవే....?

బ్రెస్ట్​ క్యాన్సర్ వచ్చిన అమ్మాయిలు, మహిళల రొమ్ముల్లో కణితులు ఏర్పడుతాయి. కణ విభజన నియంత్రణ కోల్పోయి క్షీర నాళలను దెబ్బతీస్తూ ఇవి నెమ్మదిగా లింఫ్ నోడ్స్, ఇతర భాగాలకు చేరుకొంటాయి. ఆ తర్వాత రొమ్ములో ఉన్న కండరాలను కూడా కణితులు కన్వర్ట్​ చేసేస్తాయి.అయితే ఇలా రావడానికి హార్మోన్ల అసమతౌల్యత, జీవన సరళిలో వచ్చిన మార్పులు, వాతావరణ ప్రభావం అని అంకాలజిస్టులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో అన్నీ సక్రమంగానే ఉండి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకునే వారిలో సైతం బ్రెస్ట్ క్యాన్సర్ రావడం ఆందోళన కల్గించే అంశం. అయితే ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో వీరిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుందనడానికి ఇప్పటికీ స్పష్టమైన కారణాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. మరోవైపు బ్రెస్ట్​క్యాన్సర్​వచ్చినోళ్లకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వంశపార్యంగా కూడా బ్రెస్ట్​ క్యాన్సర్​ వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఏదైనా అనారోగ్యం కారణంగా గతంలో రేడియేషన్ చికిత్స తీసుకున్న వారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. అంతేగాక ఈస్ట్రోజెన్ ప్రభావంతో చిన్నవయసులో రజస్వల కావడం, చాలా ఆలస్యంగా మెనోపాజ్ లు కూడా రొమ్ము క్యాన్సర్ కి కారణాలు గా డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఒబెసిటీ సమస్యతో బాధపడేవారికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలున్నాయి. అంతేగాక హార్మోన్ ట్రీట్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ), గర్భనియంత్రణ మాత్రలు ఉపయోగించిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి. దీని వలన ఈస్ట్రోజన్​అధికంగా విడుదలై గడ్డలుగా మారుతుందని ఆంకాలజిస్టులు పేర్కొంటున్నారు. ఇక సాధారణవారితో పోలిస్తే ఆల్కహాల్ సేవించే వారిలో రొమ్ము క్యాన్సర్ రావడానికి ఒకటిన్నర రెట్లు అవకాశం ఎక్కువ ఉంటుంది.

హర్మోన్ల ప్రభావం, లైఫ్​స్టైల్​ప్రధాన కారణం...డా గీతా నాగ శ్రీ, ఆంకాలజిస్ట్​

హార్మోన్మ ఇన్​బ్యాలెన్స్​, మారిన లైఫ్​స్టైల్​బ్రెస్ట్​క్యాన్సర్లకు ప్రధాన కారణం. గర్భం దాల్చని వారిలో, ఆలస్యంగా సంతానం కలిగిన వారితోనూ బ్రెస్ట్​ క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. అంటే 30 ఏళ్ల తర్వాత సంతానానికి జన్మనిచ్చిన వారిలో క్యాన్సర్​ వచ్చే ప్రమాదం ఉన్నది. ఇక నోటి క్యాన్సర్లకు ప్రధానంగా టోబాకో కారణం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ రూపంలో తీసుకున్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది.

వివిధ రకాల క్యాన్సర్లలో అత్యధికంగా తేలిన బాధితులు

జిల్లాలు నోటిక్యాన్సర్​ బ్రెస్ట్​ క్యాన్సర్​ అన్ని రకాలునోటి క్యాన్సర్లలో ఖమ్మం టాప్​

వరంగల్​అర్బన్ 106 167 425

సిరిసిల్లా 69 166 357

కరీంనగర్ 106 155 459

ఖమ్మం 150 154 424

వరంగల్​ రూరల్ 75 118 350

పెద్దపల్లి 64 117 317

Advertisement

Next Story