- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ‘బలగం’ ఫేమ్ మొగిలయ్య కన్నుమూత
దిశ, దుగ్గొండి: బలగం ఫేమ్ మొగిలయ్య గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య సంవత్సరం కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్‌తో డైయాలసిస్ చేయించుకుంటూ అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఉన్నారు. మొగిలయ్య దంపతులు కామెడీయన్, డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. మూవీ క్లైమాక్స్‌లో మానవ సంబంధాలను వివరిస్తూ ఆయన చేసిన గానం ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి’ అనే పాట ప్రజల గుండెలను హత్తుకుని కంటతడి పెట్టించింది. ఆ సన్నివేశమే సినిమాకు హైలెట్‌గా నిలిచించింది.
దీంతో కొంరమ్మ, మొగిలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచుర్యంలోకి వచ్చారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి, చిత్ర యూనిట్ ఆర్థిక సాయం అందించింది. గత ప్రభుత్వం మొగిలయ్యకు దళితబంధు పథకం ద్వారా రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్‌లో ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మొగిలయ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఆయన మృతి పట్ల బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి, తోటి నటినటులు, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు.