Ranas Extradition : ‘26/11’ నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించాల్సిందే.. సుప్రీంకోర్టులో అమెరికా సర్కారు వాదన

by Hajipasha |
Ranas Extradition : ‘26/11’ నిందితుడు రాణాను భారత్‌కు అప్పగించాల్సిందే.. సుప్రీంకోర్టులో అమెరికా సర్కారు వాదన
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశ వాణిజ్య రాజధాని ముంబైపై 2008 సంవత్సరంలో జరిగిన 26/11 ఉగ్రదాడికి పాకిస్తాన్‌‌కు చెందిన కెనడా జాతీయుడు తహవ్వుర్ రాణా(Rana) సూత్రధారిగా వ్యవహరించాడు. తనను భారత్‌(India)కు అప్పగించకూడదంటూ అతడు నవంబరు 13న దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని అమెరికా సుప్రీంకోర్టు(US Supreme Court)ను జో బైడెన్ ప్రభుత్వం(US govt) కోరింది. ఉగ్రదాడి కేసులో విచారణ కోసం రాణాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం వాదిస్తోంది.

ఈ తరుణంలో భారత్‌కు మద్దతుగా బైడెన్ సర్కారు కూడా సుప్రీంకోర్టులో వాదన వినిపించడాన్ని కీలక పరిణామంగా భావించొచ్చు. ఈమేరకు డిసెంబరు 16వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో యూఎస్ సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ బి ప్రిలోగర్ 20 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. రాణా దాఖలు చేసిన రిట్ ఆఫ్ సెర్షియోరారీని తిరస్కరించాలని బైడెన్ ప్రభుత్వం తరఫున అమెరికా సర్వోన్నత న్యాయస్థానానికి ఆమె విన్నవించారు. భారత్‌కు అప్పగించడం నుంచి ఊరట పొందే అర్హత రాణాకు లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed