‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సాంగ్.. (పోస్ట్)

by Kavitha |
‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న సాంగ్.. (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

ఇందులో భాగంగా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ అంటూ సాగే సాంగ్ సూపర్ సక్సెస్ అందుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయింది. ‘నా లైఫ్‌లో ఉన్న ఆ ప్రేమ పేజీ తీయనా.. పేజీలో రాసున్నా అందాల ఆ పేరు మీనా..’ అంటూ సాగిన ఈ పాట మెప్పిస్తుంది. ఈ పాటలో వెంకటేష్ పాత్ర తన భార్యకు తన ఎక్స్ గురించి పరిచయం చేస్తున్నట్టు ఉంది. ఇక ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో భీమ్స్, ప్రణవి ఆచార్య పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed