Virat Kohli : ఎయిర్ పోర్టులో విరాట్ కోహ్లి వాగ్వాదం!

by Y. Venkata Narasimha Reddy |
Virat Kohli : ఎయిర్ పోర్టులో విరాట్ కోహ్లి వాగ్వాదం!
X

దిశ, వెబ్ డెస్క్ : అస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి కోపం వచ్చింది. ఓ ఎయిర్ పోర్టులో కోహ్లీ వాగ్వివాదాని (Argument)కి దిగిన ఘటన వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో విమానాశ్రయం నుంచి హోటల్ రూమ్‌కు వెళ్తుండగా ఆయన కుటుంబాన్ని ఫొటోలు, వీడియోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని కోహ్లి ఓ మహిళా జర్నలిస్టుతో గొడవకు దిగారు.

ఆమె ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడాన్ని ప్రశ్నించారు. అక్కడున్న ఎయిర్ పోర్టు సిబ్బందితో ఇలా ఫోటోలను అనుమతించరాదంటూ వాగ్వివాదం చేశారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed