- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పైపు పగిలి నీరంతా రోడ్డు పాలు…పట్టించుకోని అధికారులు
దిశ, శంకర్పల్లి : శంకర్పల్లి నుంచి గండిపేట్ వెళ్లే రహదారి వెంబడి బుల్కాపూర్ మోకిలా గ్రామాల మధ్య పైప్ లైన్ పగిలి నీరంతా రోడ్డు పాలు అవుతుంది. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ స్వార్థ మూలంగా నాసిరకంగా పైప్ లైన్లు వేయడంతో పైపులు పగిలి నీరంతా రోడ్డు ఫాలు అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో స్వచ్ఛమైన నీటిని ఇంటింటికి అందజేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రజా ప్రతినిధులు, మిషన్ భగీరథ అధికారులు పనులు నాసిరకంగా చేయడంతో పైపులు పగిలి నీరంతా వృధాగా పోతుంది. ఒకవైపు నీరు రోడ్డుపై వృధాగా పోతుండగా శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం కుళాయిల ద్వారా నాలుగు రోజులకు ఒకసారి కూడా నీరు సక్రమంగా రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శంకర్పల్లి సాయి నగర్ కాలనీలో నాలుగు రోజులకు ఒకసారి సన్నటి ధారలా నీరు రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రోజు విడిచి రోజైనా నీరు సరఫరా చేయాల్సి ఉండగా నాలుగు రోజులకు ఒకసారి మూడు బిందెలు చొప్పున నీరు రావడం పట్ల ప్రజలు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మిషన్ భగీరథ అధికారులు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో మంచినీటి సరఫరాను సక్రమంగా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.