- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health : వయసును బట్టి ఆహారాలు.. మహిళలు ఏ ఏజ్‌లో ఏం తినాలంటే..
దిశ, ఫీచర్స్ : మనం జీవించడానికి ఆహారం తప్పక అవసరం. అయితే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి మాత్రం తగిన పోషకాలు కలిగిన ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. శరీర తత్వా్న్ని బట్టి, వయస్సును బట్టి కూడా పలు రకాల ఆహారాలు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏ వయసులో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
10 నుంచి 15 ఏండ్ల వరకు
సాధారణంగా ఎదిగే వయసులో శరీరానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. అయితే ఈ జనరేషన్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఆహారాల్లో ఇది లోపిస్తోందని పోషకాహార నిపుణులు అంటున్నారు. బయట లభించే ఆహారాలు, వివిధ జంక్ ఫుడ్స్‌ను కొందరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిలో పిండి పదార్థాలు, అధిక కొవ్వులు ఉండటంవల్ల ఒబేసిటీ, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా అమ్మాయిల్లో 12 ఏండ్ల లోపు వయసులోనే రుతుక్రమం ప్రారంభం అవడం ఈ మధ్య పెరుగుతోంది. హార్మోన్లలో అసమతుల్యత కూడా ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్త కూడదంటే.. 10 నుంచి 15 ఏండ్ల వయసులోపు వారు తీసుకునే డైట్ లో గుడ్లు, ఆకు కూరలు, తాజా పండ్లు, నట్స్, వేరు శనగ, పెసలు, గోధమ వంటివి ఉండేలా చూసుకోవాలి. అలాగే బేకరీ ఫుడ్స్, స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్ సలాడ్లు, డ్రై ఫ్రూట్స్, నువ్వులు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడే వారు బొబ్బర్లు, సెనగలు, మొలకల చాట్‌లను తీసుకోవడం బెటర్.
15 నుంచి 30 ఏండ్లలో
టీనేజ్ మొదలుకొని 30 ఏండ్ల వయసును లైఫ్‌లో టర్నింగ్ పాయింట్‌గా పేర్కొంటారు. చదువు, కెరియర్ వంటి హడావిడిలో పడి చాలామంది తగిన పోషకాహారం తీసుకోరు. మరికొందరు బరువు పెరిగిపోతామనే ఉద్దేశంతో ఆహారం తక్కువగా తింటుంటారు. అయితే ఈ పరిస్థితి మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రీ ప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ వంటి సమస్యలకు కారణం అవుతుందిని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే 15 నుంచి30 ఏండ్ల వయసులో పప్పుధాన్యాలు, పండ్లు, నట్స్, సీఫుడ్, సోయా, తృణ ధాన్యాలు, లో ఫ్యాట్ కలిగిన ఆహారాలు, పచ్చని కూరగాయలు, బచ్చలి కూర, తోటకూర, బీన్స్, పౌల్ట్రీ, చేపలు వంటివి ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకోవడం బెటర్.
30 నుంచి 40 ఏండ్ల వరకు
సాధారణంగా 30 నుంచి 40 ఏండ్ల మధ్య పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. దీనికి తోడు మహిళల్లో హార్మోన్లలో మార్పులు, హెచ్చు తగ్గులు సంభవిస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సరైన పోషకాలు లభించకపోతే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం కారణంగా అధిక బరువు, డిప్రెషన్ వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం డైటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్ ఎ, సితోపాటు అన్ని రకాల మినరల్స్ అవసరం. గుడ్లు, బీన్స్, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాల్లో ఇవి తగినంతగా లభిస్తాయి.
40 నుంచి 60 ఏండ వరకు
చాలా మంది స్త్రీలలో 45 నుంచి 55 ఏండ్ల మధ్య మెనోపాజ్ స్టేజ్ ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మూడ్ స్వింగ్స్, స్ట్రెస్, తీవ్రమైన అలసట, నీరసం, వెజైనా పొడిబారడం వంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి. దీంతోపాటు కీళ్ల నొప్పులు కూడా వేధిస్తాయి. అయితే ఈ ఏజ్‌లో తగిన పోషకాలు అందకపోతే అనారోగ్యాలు అధికం అవుతాయి. ఎక్కువకాలం జీవించే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి దీర్ఘాయుష్షు కోసం మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి అధికంగా ఉండే ఆహారాలు రెగ్యలర్‌గా తీసుకోవాలి. బ్రోకలీ, బార్లీ, గింజలు, నట్స్, బీన్స్, గుడ్లు, మాంసం, చేపలు, ఆకు కూరలు వంటి ఆహారాల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఇక 60 ఏండ్లు దాటాక ఈజీగా జీర్ణమయ్యే ఆహారాలపై ఫోకస్ చేయాలి. హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ఆహారాల్లో ఉప్పు, చక్కెర వంటివి తగ్గించాలి. బీన్స్, బఠానీలు, సీ ఫుడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఇంకా ప్రొటీన్ రిలేటెడ్ ఆహారాలు, పండ్లు తీసుకోవాలి. సరిపడా నీళ్లు తాగాలి.
*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.