Harirama Jogaiah: మంత్రి నిమ్మల రామానాయుడుకి హరిరామ జోగయ్య లేఖ

by Jakkula Mamatha |
Harirama Jogaiah: మంత్రి నిమ్మల రామానాయుడుకి  హరిరామ జోగయ్య లేఖ
X

దిశ,వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, కాపు నేత హరిరామ జోగయ్య మరో లేఖతో ముందుకొచ్చారు. పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కోరుతూ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu), ఎంపీ శ్రీనివాస్ వర్మ(MP Srinivas Varma)కు హరిరామ జోగయ్య(Harirama Jogaiah) లేఖ రాశారు. ఈ క్రమంలో అభివృద్ధి(Development) అంటే పరిపాలన భవనాలు, నివాస భవనాలు, పార్క్‌లు నిర్మించడానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదని ఆయన తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం, సాగు నీరు, మురుగు కాలువల నిర్మాణం కూడా అతి ముఖ్యం అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయని విమర్శించారు.

రాజ్య భవనాలు, నివాస, పరిపాలన భవనాల నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలను ఖర్చు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఇది నిజమైన అభివృద్ధి అనిపించుకోదని విమర్శించారు. ఎవరికైనా పెద్ద వైద్య అవసరం వస్తే హైదరాబాద్‌(Hyderabad)కు, వైజాగ్‌(Viazag)కు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఆ ఇబ్బందుల నుంచి బయట పడటానికి ఆరోగ్యశ్రీ సదుపాయం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. నరసాపురం, భీమవరం, రాజోలు నియోజకవర్గాలకు సమదూరంలో ఉన్న పాలకొల్లు నియోజకవర్గం(Palakollu Constituency)లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Super Specialty Hospital)ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story