KTR : ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. సచివాలయం, అసెంబ్లీ పక్క పక్కనే ఉంటే బాగుంటుందంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేగిన రాద్ధంతంపై కేటీఆర్ స్పందిస్తూ చరిత్ర విలువ తెలియదు మహోన్నతులను గౌరవించడం చేతకాదంటూ మండిపడ్డారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం గర్జించిన దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ మీదనా మీ పిల్లికూతలు? అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

పేదల ఇళ్లు కూల్చినా ఇంకా మీ ఆకలి తీరలేదా? మహోన్నతుల సమాధులను కూడా వదిలిపెట్టరా? అంటూ ప్రశ్నించారు. కూల్చడం! మార్చడం! ఆనవాళ్లు చెరిపేయడం! ఇదేగా మీకు చేతనైనదంటూ విమర్శించారు. ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదని..విధ్వంసకారుడి వికృత ఆలోచ‌న‌ల‌కు ప్రతిరూపమని దుయ్యబట్టారు.

Advertisement

Next Story