- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన
దిశ, ఘట్కేసర్ : ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థులకు శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వకుండా పరీక్షలు రాయనివ్వట్లేదని ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బుధవారం ఫీజు రీయింబర్స్మెంట్ రాని విద్యార్థులను శ్రీనిధి క్యాంపస్ వేలుపలే నిలిపి వేశారని గురువారం ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అంకం శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కళాశాల అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద బైఠాయించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో సంబంధం లేకుండా పరీక్షలు రాయించాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఘట్కేసర్ మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. శ్రీనిధి విద్యాసంస్థల చైర్మన్ కె.టి.మహి అందుబాటులో లేదని విదేశాల్లో ఉన్నాడని ఆయన వచ్చిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటారని కళాశాల ప్రిన్సిపల్ శివారెడ్డి విద్యార్థులకు నచ్చచెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించుకున్నారు. చైర్మన్ వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ కి సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు హామీ ఇవ్వకపోతే విద్యార్థుల పక్షాన ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.