- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Bhatti: అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య.. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ (BRS) పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో అప్పులు, వాటి చెల్లింపులపై ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేశామని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం అప్పు రూ.6 లక్షల 71 వేల కోట్లు అప్పు ఉందని ఆయన తెలిపారు. అప్పులపై హరీష్‌రావు (Harish Rao) అనేక ఆరోపణలు చేశారని.. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్లు చెప్పడం ఆయనకే చెల్లిందని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ (BRS) నేతల పెండింగ్ బిల్లులే రూ.40వేల 150 కోట్లు ఉన్నాయని, అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే రూ.7లక్షల 19వేల కోట్ల అప్పు ఉందన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక రూ.52 వేల కోట్లు అప్పు చేశామని తెలిపారు. తప్పుడు లెక్కలు చెప్పి సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ (BRS) అంటోందని.. సభలోనే కాదు బయట కూడా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్ల లాగా తాము ప్రభుత్వం ఆస్తులను అమ్ముకోలేదంటూ చురకలంటించారు. ఎయిర్‌పోర్టు (Airport), ఓఆర్ఆర్ (ORR) లీజుకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఏ ఆస్తులను అమ్మకుండానే హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు, బకాయిలను క్లియర్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాటు స్కూళ్లలో డైట్ బిల్లలు కూడా పెంచలేదు. తాము డైట్ బిల్లు (Diet Bills) పెంచామని.. యంగ్ ఇండియా స్కూల్స్ (Young India Schools) ఏర్పాటు చేస్తు్న్నామని అన్నారు.