- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదుపుతప్పి యాష్ ట్యాంకర్ బోల్తా..
దిశ, జూలూరుపాడు : జూలూరుపాడు లోని సీతారామ కార్యాలయ సమీపంలో గురువారం తెల్లవారుజామున యాష్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సూర్యాపేట జిల్లా మటన్ పల్లి మండలం బొజ్జ తండా గ్రామానికి చెందిన ఎస్ శివకు గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే మణుగూరులోని బీటీపీఎస్ లో ట్యాంకర్ లో యాష్ లోడ్ చేసుకుని దిగుమతి చేసేందుకు జాన్ పాడు వెళుతున్నాడు. ఈ క్రమంలో జూలూరుపాడులోని సీతారామ కార్యాలయ సమీపంలో ఎదురుగా వెళుతున్న కారును తప్పించబోయి ట్యాంకర్ అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పొలంలో బోల్తా పడింది.
లారీ డ్రైవర్ శివ క్యాబిన్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో సంఘటనా స్థలానికి స్థానిక పోలీసులు, కొత్తగూడెం ఫైర్ రెస్క్యూ సిబ్బంది చేరుకుని డ్రైవర్ను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించి క్రేన్, జేసీబీ సహాయంతో స్థానికులతో కలిసి వారు డ్రైవర్ ను బయటకు తీసి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనలో డ్రైవర్ కాళ్లు విరిగాయి. అతనికి వైద్య చికిత్సలు అందించేందుకు 108లో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య సందర్శించి వివరాలను నమోదు చేసుకున్నారు.