- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎడ్లబండిపై అసెంబ్లీకి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతోన్న తరుణంలో విపక్షాలు వినూత్నంగా నిరసనలకు దిగుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ (BRS) నేతలు లగచర్ల రైతుల అరెస్ట్‌కు నిరసనగా బేడీలతో ఇటీవలే సభకు వచ్చారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించాలంటూ ఆ పార్టీ నేతలంతా ఆటోవాలా డ్రెస్సులు ధరించి అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఇవాళ రాష్ట్రంలోని రైతుల సమస్యలను తీర్చాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలంతా ఎడ్లబండిలో సభకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) మాట్లాడుతూ.. రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయమే లేదా అని మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలకు మభ్యపెడుతోందని ఆరోపించారు. అర్హులైన రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు మంజూరు చేయాలని అన్నారు. రైతు భరోసా (Raithu Bharosa) పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై సర్కార్‌కు కనువిప్పు కలగాలనే తాము ఇవాళ ఎండ్లబండిపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.