- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహానటి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ స్టార్ హీరో.. ది మోస్ట్ అవైటెడ్ పిక్ అంటూ కామెంట్స్ (పోస్ట్)
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్‌గా తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 15 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట గోవాలో గ్రాండ్‌గా తెలుగు సంప్రదాయంలో మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం క్రిస్టియన్ పద్ధతిలో కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే గోవాలో జరిగిన వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. వారు ఈ జంటను ఆశీర్వదించిన ఫొటోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఈ జంట ఫొటోలకి స్టిల్ ఇచ్చారు. అలాగే వీరిని విజయ్ బ్లెస్ చేస్తున్న పిక్‌ను కూడా షేర్ చేసింది. అంతే కాకుండా ‘మా డ్రీమ్ మ్యారేజ్ వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన విజయ్ సార్‌కి ధన్యవాదాలు.. ప్రేమతో మీ నంబీ, నంబన్’ అనే క్యాప్షన్‌ను జోడించింది. అయితే ఈ ఫొటో చూస్తే ఓవర్ ఆల్ పెళ్ళిలో తలపతినే స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిని చూసిన నెటిజన్లు ది మోస్ట్ అవైటెడ్ పిక్(చాలా మంది ఎదురు చూస్తున్న పిక్) అంటూ కామెంట్స్ చేస్తున్నారు.