PG Admissions: మెడికల్ పీజీ అడ్మిషన్లపై తొలగని అనిశ్చితి.. కోర్టు తీర్పు నేపథ్యంలో సర్కార్ స్టడీ

by Shiva |
PG Admissions: మెడికల్ పీజీ అడ్మిషన్లపై తొలగని అనిశ్చితి.. కోర్టు తీర్పు నేపథ్యంలో సర్కార్ స్టడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ పీజీ అడ్మిషన్లపై సర్కారు సీరియస్‌గా స్టడీ చేస్తున్నది. హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయంపై అధ్యయనం చేస్తున్నది. లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో డిస్కషన్ చేస్తున్నది. దీంతో పాటు ఉన్నతాధికారుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నది. లీగల్ టీమ్, ఆఫీసర్ల కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చేసినోళ్లకు పీజీకి అవకాశం కల్పిస్తారా? లేదా ఇతర రూల్స్ ఫ్రేమ్ చేస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది.

స్థానిక విద్యార్థులకే పీజీ సీట్లు.. మంత్రి దామోదర హామీ

ఇక మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్లపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ బుధవారం ప్రత్యేక ట్వీట్ చేశారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 15 %అన్‌రిజర్వ్‌డ్ కోటాలో చదివిన నాన్ లోకల్ విద్యార్థులను, పీజీ అడ్మిషన్లలో లోకల్ కోటాకు ఇన్‌ ఎలిజిబుల్ చేసి, తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా జీవో 148, 149 తీసుకొచ్చామన్నారు. ఈ మార్పు తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడానికే తప్ప, వారికి నష్టం చేసేందుకు కాదని వివరించారు. స్థానికేతరులకు అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పడాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారని తెలిపారు. ఈ తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరిగింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారం, గోబెల్స్ కూడా సిగ్గుపడేలా ఉన్నదని పేర్కొన్నారు. అలాంటి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. కోర్టు తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి, స్థానిక విద్యార్థులకు పీజీ సీట్లు దక్కేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed