అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. విపక్షాలపై స్పీకర్‌ ఆగ్రహం

by Mahesh |
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. విపక్షాలపై స్పీకర్‌ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో శీతాకాల సమావేశాల్లో(Winter meetings) భాగంగా ఐదో రోజు సభ ప్రారంభం అయింది. ఈ క్రమంలో ప్రతిపక్షంలోని బీజేపీ(bjp), బీఆర్ఎస్(brs) పార్టీలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు(Adjournment resolutions) ఇచ్చారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అయిన వెంటనే విపక్షాలు.. తాము ఇచ్చిన వాయిదా తీర్మాణాలపై చర్చకు పట్టుబట్టారు. దీంతో సభ ప్రారంభంలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విపక్షాలపై తీరుపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా స్పీకర్ విపక్ష పార్టీ సభ్యుల(Opposition party members)కు సూచించారు. అలాగే సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని వెల్‌లోకి విపక్ష సభ్యులు రాకూడదని స్పీకర్‌ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed