MLC Kavitha : రైతుబంధు హామీలను గుర్తు చేసేందుకే ఆకుపచ్చ కండువాలు : ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |
MLC Kavitha : రైతుబంధు హామీలను గుర్తు చేసేందుకే ఆకుపచ్చ కండువాలు : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇచ్చిన రైతుబంధు(Rythu Bandhu) హామీని నెరవేర్చనందుకు నిరసనగా..హామీని గుర్తు చేసేందుకే ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో శాసన మండలికి వచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో శాసనసభ, మండలికి రావడం పట్ల ఆమె స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి 2024ఏప్రిల్ 20వ తేదీన ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా, 21వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, 22వ తేదీన బాసర సరస్వతి అమ్మవారి మీద, 23న జోగులాంబ అమ్మవారిపైన, 24వ తేదీన రామప్ప దేవాలయం శివయ్య సాక్షిగా, మే 9వ తేదీన ఆర్మూర్ సుద్ధలగుట్ట దేవుడి సాక్షిగా రైతులకు రైతుబంధు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆ హామీని నెరవేర్చనందుకు ఈ రోజు ఆకుపచ్చ కండువాలతో మండలికి వచ్చామని, హామీని నెరవేర్చనందుకు మీ ద్వారా మా నిరసన తెలియజేస్తున్నామని కవిత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed