నిర్దేశిత సమయంలోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్

by Kalyani |
నిర్దేశిత సమయంలోగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్
X

దిశ, జనగామ : జిల్లాలోని శామీర్పేట్, అలాగే బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సర్వేయర్ లు చేస్తున్న సర్వే సరళిని పరిశీలిస్తూ క్రమబద్ధత తో పని చేయాలని ఆదేశించారు. అదే విధంగా తానే స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి, సొంత స్థలం కలిగి ఉన్నారా? స్థలానికి సంబంధించి ఏమైనా ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? అని తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు గాను చేపట్టిన ఈ సర్వేను సజావుగా నిర్వహించాలని సూచించారు. నిర్దేశిత సమయంలోగా ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఈ పర్యవేక్షణలో అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రకాష్ రావు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed