Minister Ponnam: అమిత్‌ షాపై అట్రాసిటీ కేసు బుక్ చేయాలి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Shiva |
Minister Ponnam: అమిత్‌ షాపై అట్రాసిటీ కేసు బుక్ చేయాలి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అమిత్ షాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సదర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్‌పై బీజేపీ స్టాండ్ ఎంటో అమిత్ షా బయట పెట్టారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్రే లేదని ఎద్దేవా చేశారు. ఓ వైపు కాంగ్రెస్ నేతలు స్వాతంత్య్ర పోరాటం చేస్తుంటే బీజేపీ నేతలు బ్రిటిష్ వారికి తాబేదార్లుగా పని చేశారని మంత్రి పొన్నం మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed