Weather technology : 15 రోజుల ముందే పసిగట్టవచ్చు..! అందుబాటులోకి AI వెదర్ పరికరం

by Javid Pasha |   ( Updated:2024-12-19 07:59:17.0  )
Weather technology : 15 రోజుల ముందే పసిగట్టవచ్చు..!  అందుబాటులోకి AI వెదర్ పరికరం
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది? ఉష్ణోగ్రతలు తగ్గాయా.. పెరిగాయా?.. సాధారణంగా ఇలాంటి సమాచారాన్ని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అలాగే గూగుల్ వెదర్ రిపోర్ట్‌ను కూడా మనం చూస్తుంటాం. అయితే ఇవన్నీ ఏ రోజుకారోజు లేదా ఒకటి రెండు రోజుల ముందస్తు సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి. కానీ ఇక నుంచి15 రోజుల ముందే తెలుసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్‌కు చెందిన డీప్‌మైండ్ ల్యాబ్ రీసెర్చర్స్ ఇప్పుడు తావావరణాన్ని అంచనా వేసే కొత్త ఏఐ మోడల్‌ను రూపొందించారు. దీనికి జెన్‌కాస్ట్ అని పేరు పెట్టారు.

ఇప్పటి వరకు వాతావరణ అంచనాల కోసం అందుబాటులో ఉన్న వనరులు, టెక్నాలజీ ద్వారా వెదర్‌ను అంచనా వేయడానికి గంటలకొద్దీ సమయం తీసుకునేది. కానీ ‘జెన్‌కాస్ట్’ డివైజ్ కేవలం 8 నిమిషాల్లోనే ఆ సమాచారాన్ని తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే దీనిని అందరికీ అందుబాటులోకి తేవాలని పరిశోధకులు భావిస్తున్నారు.

వరదలు, తుపాన్లు, అధిక, అత్యల్ప వర్షపాతాలు వంటి సమాచారాన్నంత ఈ జెన్‌కాస్ట్ అనే పరికరం ఎప్పటికప్పుడు క్రోడీకరించి, ఎనలైజ్ చేసి అందిస్తుంది. అంతేకాకుండా ఇది 50 వేర్వేరు వెదర్ రిపోర్ట్‌లను కూడా ఒకేసారి ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం జెన్‌కాస్ట్‌కు 40 ఏండ్ల వెదర్ ఇన్ఫర్మేషన్‌తో నిపుణులు ట్రైనింగ్ ఇచ్చారు. గాలి, ఉష్ణోగ్రతలు, వరదలు, తుపానులు, వాతావరణ మార్పులు, ప్రమాద హెచ్చరికలు వంటి విషయాలను ఈ పరికరం నేర్చుకుందని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed