ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ సినిమాపై అలాంటి రూమర్స్.. స్పందించిన మూవీ టీమ్(పోస్ట్)

by Kavitha |
ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ సినిమాపై అలాంటి రూమర్స్.. స్పందించిన మూవీ టీమ్(పోస్ట్)
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంయుక్తంగా సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జేట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల స్ఫూర్తితో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రంగా కొత్త సంవత్సరంలో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కేవలం ప్రకటనతో మాత్రమే ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు నెట్టింట షికార్లు చేశాయి. ఇక రీసెంట్‌గా వీటిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రశాంత్ వర్మ- మోక్షజ్ఞ ప్రాజెక్టుపై కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ గురించి చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎస్ఎల్‌వీ సినిమాస్’ తాజాగా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.

‘మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ గురించి పలు రూమర్స్ వచ్చాయి. అందులో ఏవీ నిజం కాదు. ఈ ప్రాజెక్ట్ గురించి భవిష్యత్‌లో ప్రకటనలు, అప్డేట్స్‌ను మా సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తాము. @SLSVCinemasOffl, @LegendProdOffl మా ఎక్స్ ఖాతాలలో మాత్రమే ప్రకటిస్తాము. పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి అసత్య ప్రచారాలను ఎంకరేజ్ చేయకండి అని కోరుతున్నాము’ అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

Next Story