- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దాపూర్ గురుకులంలో మరో విద్యార్థికి అస్వస్థత..
దిశ, కోరుట్ల : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇటీవల విద్యార్థులు పాముకాటుకు గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలు మరవక ముందే అదే పాఠశాలలో బుధవారం ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో యాంటీ వీనామ్ ఇంజక్షన్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న డీఎంహెచ్వో కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్ లు బుధవారం ఆస్పత్రిలో ఉన్న అఖిల్ అనే విద్యార్థి ఆరోగ్యం పై ఆరాతీసి ఎలాంటి అపాయం లేదని తెలిపారు.
విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం అది పాము కాటే అని ఆరోపించారు. కాగా తాజాగా గురువారం ఎనిమిదో తరగతి చదువుతున్న మరో విద్యార్ధి బోడ యశ్వంత్ అస్వస్థతకు గురికావడంతో అలర్ట్ అయిన పాఠశాల సిబ్బంది కోరుట్లలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశ్వంత్ ఆరోగ్యం నిలకడగా ఉండగా చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. తాజాగా గురువారం అస్వస్థతకు గురైన విద్యార్థి యశ్వంత్ పాము కాటుకు గురయ్యాడ లేదా ఏదైనా విషకీటకమా, మరేదైనా జరిగిందా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.