ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..

by Sumithra |
ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
X

దిశ, అల్వాల్ : మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలన్నింటిని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. సమస్యలను నాలుగు అంశాలవారీగా వినతి పత్రంలో వివరించారు. నెంబర్ 1, నియోజకవర్గంలోని మొత్తం విస్తీర్ణం 384.29 ఎకరాలు కాగా అందులో గల భూముల్లో 70 కాలనీలు, బస్తీలు దాదాపు 30 ఏళ్ల క్రితమే ఏర్పడ్డాయి, 1,9674 కుటుంబాలు ఒక లక్ష జానాభా ఉన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తే పేద ప్రజల ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వారి జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వక్ఫ్ బోర్డు ప్రకటించిన నిషేధిత సర్వేనంబర్ జాబితా నుండి పేద ప్రజల ఇండ్లను ఆ జాబితా నుండి తొలగించి వారికి నివాసయోగ్యంగా ఉండేలా చూడాలని కోరారు.

2. గౌతం నగర్ 141 డివిజన్ ప్రజల దాహార్తి తీర్చేదుకు మహేంద్ర హిల్స్ వద్ద ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో 5 ఎంఎల్ఆర్ సీసీ గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్ ను నిర్మిస్తే (జీఎల్ఆర్ఎస్) అవసరమైన ఇన్ లెట్, అవుట్ లెట్ పైపింగ్ ఏర్పాటు చేసి సమర్థవంతమైన నీటి పంపిణీ వ్యవస్థ ద్వారా మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని దాదాపుగా 135,250 నివాస సముదాయాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని, 141, 139, 140 మూడు డివిజన్లకు దీర్ఘకాలం ప్రయోజనం ఉంటుందని వివరించారు. 3. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని రెండు సర్కిల్లలో 9 డివిజన్లలో ఉన్న చెరువుల సుందరీకరణ కొరకు, అభివృద్ది పనులకు గాను నిధులు మంజూర్ చేసిన కోర్టు కేసులు, భూములకు సంబంధింత కేసులు వలన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. శాఖాపరమైన చర్యలు తీసుకుని వాటిని అభివృద్ది చేయాలని సమగ్రమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయవచ్చని తద్వారా దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు, చెరువుల పరిరక్షణ చెరువుల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. 4. మల్కాజిగిరి నియోజకవర్గానికి ముఖ్య వారధిగా ఉన్న ప్రస్తుత ఆర్ కే పురం ప్లైఓవర్ బ్రిడ్జి సరిపోవడం లేదని దాని వలన వాహనదారులు నిత్యం బాధలు పడుతున్నారని ఇటీవల పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బ్రిడ్జిని విస్తరించాలని వాహనాల రాకపోకలకు అనువుగా నూతనంగా మరో బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ వినతి పత్రం అందజేశారు.

Advertisement

Next Story