Fire Accident: నగరంలో ఘోర అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

by Shiva |   ( Updated:2024-12-19 02:38:54.0  )
Fire Accident: నగరంలో ఘోర అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా, ఐఎస్ సదన్ (IS Sadan) పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్నపేట (Madannapet)లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ తుక్కు గోదాంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. మంటలకు తోడుగా దట్టమైన నల్లటి పొగ పరిశ్రమ నుంచి వెలువడుతోంది. పరిశ్రమల షట్టర్లను గ్యాస్ కట్టర్లతో సిబ్బంది కట్ చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఆరు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఱణ

Advertisement

Next Story

Most Viewed